
హైదరాబాద్, వెలుగు: మాంగళ్య షాపింగ్‌మాల్ తన 22వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ఏర్పాటు చేసింది. దీనిని సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. షాపింగ్‌మాల్ డైరెక్టర్లు పీఎన్ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 22స్టోర్ లు ప్రారంభించామని అన్నారు. అతి త్వరలో కర్ణాటకలో కూడా స్టోర్లను ఓపెన్ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మాంగళ్య అవతరించిందని శ్రీలీల అన్నారు. ఇక్కడ పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు, లేటెస్ట్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.